1. సింధూ నాగరికతకు చెందిన కోటలేని ఏకైక నగరం?
ఎ. లోథల్ బి. బన్వాలి
సి. చాన్హుదారో డి. కాళిభంగన్
2. హరప్పా పట్టణం ఈ నది ఒడ్డున ఉంది?
ఎ. సట్లెజ్ బి. సరస్వతి
సి. బియాస్ 4. రావి
3. జతపరచండి.
ఎ. అగ్నిపూజ 1. లోథల్
బి. గుర్రం అవశేషాలు 2. కాలిభంగన్
సి. స్నాన ఘట్టం 3. మొహంజోదారో
డి. ధాన్యాగారం 4. హరప్పా
ఇ. నౌకా నిర్మాణం 5. సుర్కొటుడా
1. ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2. ఎ-2, బి-5, సి-3, డి-4, ఇ-1
3. ఎ-5, బి-5, సి-3, డి-2, ఇ-1
4. ఎ-5, బి-3, సి-4, డి-2, ఇ-1
4. వేదకాలంలో ఒక ఆభరణమనే అర్థంలో ఉపయోగిం చిన 'నిష్క' అనే పదాన్ని తర్వాత కాలంలో దేన్ని సూచించడానికి ఉపయోగించారు?
ఎ. ఆయుధం
బి. వ్యవసాయ పనిముట్టు
సి. నాణెం డి. లిపి
5. భారతీయ సంగీతానికి మూలాలు ఈ వేదన సంహితలో కనిపిస్తాయి?
ఎ. రుగ్వేదం బి. సామవేదం
సి. యజుర్వేదం డి. అధర్వణ వేదం
6. కింది వైదిక దేవుళ్లలో ఏ దేవుడు సింధూ ప్రజలు పూజించిన పశుపతి మహాదేవుడి తెగనుంచి ఉత్పన్నమయ్యాడని భావిస్తున్నారు?
ఎ. ప్రజాపతి బి. విష్ణువు
సి. పుషన్ డి. రుద్రుడు
7. ఆయుర్వేదంకు మూలాలు ఈ సంహితలో కనపడతాయి?
ఎ. రుగ్వేదం బి. యజుర్వేదం
సి. సామవేదం డి. అధర్వణవేదం
8. బుద్దుడిని ఈ కింది పేరుతో కూడా పిలుస్తారు?
ఎ. గౌతముడు బి. తథాగతుడు
సి. సిద్ధార్థుడు డి. పైవన్నీ
9. బుద్దునికి సంబంధించి సారనాథ్ దీనికి ప్రసిద్ది?
ఎ. జన్మస్థలం
బి. నిర్యాణం చెందిన స్థలం
సి. మొదటి ఉపదేశం చెందిన స్థలం
డి. ఏదీకాదు
10. త్రిపీటకలు ఈ భాషలో ఉన్నాయి?
ఎ. ప్రాకృతం బి. సంస్కృతం
సి. పాళీ డి. ఏదీకాదు
11. బౌద్దమత గ్రంథాలు?
ఎ. పురాణాలు బి. త్రిరత్నాలు
సి. త్రిపీటకాలు డి. ఆర్యసూత్రాలు
12. అష్టాంగ మార్గమును బోధించునది?
ఎ. మహావీరుడు బి. గౌతమ బుద్దుడు
సి. పార్శ్వ నాథుడు డి. మొగలిపుత్తతిస్స
13. బుద్దుని జన్మస్థలం అయిన లుంబిని వద్దగల రుమ్మిందై స్థూపం ఎవరు నిర్మించారు?
ఎ. అజాతశత్రు బి. కాలశోకుడు
సి. అశోకుడు డి. కనిష్కుడు
14. వజ్రయానం ఈ కాలంలో ప్రసిద్ధి చెందింది?
ఎ. కనిష్కుని కాలంలో బి. హర్షుని కాలంలో
సి. అశోకుని కాలంలో
డి. పాలవంశపు రాజులకాలంలో
15. యోగాచార చింతనను స్థాపించినవారు?
ఎ. నాగార్జునుడు బి. అసంగుడు
సి. అలారకలము డి. మైత్రేయ నాథుడు
16. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. ఇండియన్ ఐన్‌స్టీన్‌గా నాగార్జునుడుని పేర్కొన్నారు.
బి. ఇండియన్ కాంట్‌గా ధర్మకీర్తిని పేర్కొన్నారు.
సి. దిజ్ఞాగుడు భారతీయ తర్కశాస్త్రపిత
డి. అశ్వఘోషుడు ప్రసిద్ధ జైన నాటక కర్త
17. సరిగా జత కానిదాన్ని గుర్తించండి?
ఎ. జననం-పద్మం, ఎద్దు
బి. మహాపరిత్యాగం- సింహం
సి. నిర్వాణం - బోధివృక్షం
డి. పరినిర్వాణం - స్థూపం
18. పంచవ్రతాల్లో మహావీరుడు చేర్చిన సూత్రం.
ఎ. అహింస బి. బ్రహ్మచర్యం
సి. సత్యభాషణ డి. అస్తేయ
19. ద్వితీయ జైన సంగమం ఇక్కడ జరిగింది?
ఎ. వల్లభి బి. పాటలీపుత్ర
సి. ఉజ్జయిని డి. శ్రావణ బెళగొళ
20. బుద్దుని జీవితానికి సంబందించి ధర్మచక్రం లేదా ఎనిమిది ఆకులు గల చక్రం దీనికి ప్రతీక
ఎ. జననం
బి. మొదటి ధర్మోపదేశం
సి. మహాపరిత్యాగం డి. నిర్వాణం
21. జైనతీర్థంకరుడైన రుషభనాథుని పేరు ఈ వేదంలో ప్రస్తావించబడింది?
ఎ. రుగ్వేదం బి. సామవేదం
సి. యజుర్వేదం డి. అధర్వణవేదం
22. కౌటిల్యుని సహాయంతో చంద్రగుప్తమౌర్యుడు సందులను పదవీచ్యుతులను చేసి వివరాలను అందించే గ్రంథం?
ఎ. దేవీ చంద్రగుప్తం బి. కిరాతార్జునీయం
సి. మృచ్ఛకటికం డి. ముద్రారాక్షసం
23. భూమి, గాలి, నీరు, వెలుతురులను ఎలా నాశనం చేయలేమో, విచారాన్ని, సంతోషాన్ని, జీవితాన్ని కూడా నాశనం చేయలేమని బోధించిన పకుథ కాత్యాయన బోధనల నుంచి పుట్టుకొచ్చిన షడ్దర్శనం.
ఎ. వైశేషిక బి. న్యాయ
సి. సాంఖ్య డి. యోగ
24. మౌర్యుల గురించి సమాచారం అందించని గ్రంథం?
ఎ. కౌటిల్యుని (అర్ధశాస్త్రం)
బి. మెగస్తనీస్ (ఇండికా)
సి. విశాఖదత్తుని ముద్రారాక్షసం
డి. విశాఖదత్తుని దేవీ చంద్రగుప్తం
25. కింది వాటిలో ఏది సరైనది.
ఎ. క్రీ.శ 78లో కనిష్కుడు శక సంవత్సరానికి పునాది వేశాడు.
బి. శకవంశానికి చెందిన 1వ రుద్రదాముడు మౌర్యుల కాలంనాటి సుదర్శన సరస్సును మరమ్మత్తు చేయించాడు.
సి. మొదటి శుద్ద సంస్కృత శాసనాన్ని వేయించినవాడు రుద్రదమనుడు.
డి. పైవన్నీ సరైనవే
26. సంపూర్ణ భౌతికవాదం బోధించిన తొలి గురువు?
ఎ. మక్కాలి గోశాల బి. పురాణ కస్సప
సి. అజితకేశ కంబలి
డి. పైవారు ఎవరూ కాదు
27. గాంధార శిల్పకళ వీరికాలంలో అంకురించింది?
ఎ. ఇండోగ్రీకులు బి. కుషానులు
సి. శకులు డి. పార్థియన్లు
28. 'హస్తాయుర్వేదం లేదా పశువైద్యవిజ్ఞానం' గ్రంథాన్ని ఇతడు రచించాడు?
ఎ. సుశ్రుతుడు బి. పాలకావ్యుడు
సి. పతంజలి డి. పై ఎవరూకాదు
29. కింది వాటిలో సరైనది?
ఎ. సూర్య సిద్ధాంతం- ఆర్యభట్టుడు
బి. బృహత్సంహిత -వరాహమిహిరుడు
సి. న్యూటన్ విజయం- బ్రహ్మగుప్తుడు
డి. అన్నీ సరైవే
30. 'నవరత్నాలు' ఇతని ఆస్థానాన్ని అలంకరించారు?
ఎ. సముద్ర గుప్తుడు
బి. కుమార గుప్తుడు
సి. మొదటి చంద్ర గుప్తుడు
డి. రెండవ చంద్ర గుప్తుడు
31. సింధూ ప్రాంతానికి చెందిన అధిక శాతం ముద్రల్లో మనకు ఈ బొమ్మలు కనబడతాయి?
ఎ. పులి బి. ఏనుగు
సి. ఒంటికొమ్ము రుషభం లేదా మూపురం లేని రుషభం
డి. మూపురంతో కూడిన రుషభం
32. సింధులోయ నాగరికతలో మనకు ఈ పంట జాడ కనిపించదు?
ఎ. ఆవాలు బి. చెరకు
సి. నువ్వులు డి. బార్లీ
33.'మృతుల దిబ్బ' అని అర్థం వచ్చే సింధూ నాగరికతా పట్టణం?
ఎ. లోథల్ బి. హరప్పా
సి. కాలిభంగన్ డి. బన్వాలి
34. సింధులోయ నాగరికతకు చెందని పట్టణం?
ఎ. రూపర్ బి. సుత్కజండర్
సి. సుర్కొటుడా డి. పూతన్
35. సింధు ప్రజల మతంలో మనకు ఈ అంశాన్ని పూజిం చడం కనబడదు?
ఎ. అమ్మతల్లి
బి. కొన్ని కల్పిత జంతువుల మరియు వాటి మానవ సంబంధ బొమ్మలు
సి. చెట్టు, ఆత్మలు డి. ప్రకృతి శక్తులు
36. వేదం అంటే అర్థం ఏమిటి?
ఎ. దేవుని ఆజ్ఞ బి. ప్రార్థన
సి. జ్ఞానము డి. ఇవన్నీ
37. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని మొదటి సారిగా తెలిపిన వ్యక్తి?
ఎ. మెక్‌డొనాల్డ్ బి. విలియం జోన్స్
సి. జె.డి. మోర్గాన్ డి. మాక్స్ ముల్లర్
38. రుగ్వేద కాలంలో అధిక ప్రాముఖ్యం గల నది?
ఎ. సరస్వతి బి. గంగ
సి. యమున డి. సింధు
39. వేద సంహితను ఇలా పిలుస్తారు?
ఎ. శృతి బి. స్మృతి
సి. సూత్రాలు డి. ఏదీకాదు
40. ఏది సరైన జతకాదు?
ఎ. సాంఖ్య- కపిల బి. న్యాయ- జెమిని
సి. వైశేషిక - కణాదుడు డి. యోగ - పతంజలి
41. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి?
ఎ. శిక్ష బి. నిరుక్త
సి. న్యాయ డి. ఛందస్సు
42. తొలివేదకాలం గురించి తెలుసుకోవడానికి ఆధారం..
ఎ. రుగ్వేదం బి. అధర్వణవేదం
సి. బ్రాహ్మణాలు డి. పైవన్నీ
43. రుగ్వేద ఆర్యుల ప్రధాన ఆరాధ్య దైవం.
ఎ. ఇంద్రుడు బి. ప్రజాపతి
సి. విష్ణువు డి. రుద్రుడు
44. మొహంజోదారో పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త.
ఎ. ఆర్.డి. బెనర్జీ బి. సర్ జాన్ మార్షల్
సి. ఎస్.ఆర్.రావు డి. ఆర్.ఎస్. బిస్త్
45. సింధు నాగరికతను కనుగొన్న సంవతసరం?
ఎ. 1920 బి.1921
సి. 1922 డి. 1923
46. మన దేశంలో సింధూ నాగరికత ప్రాంతాలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ. గుజరాత్ బి. పంజాబ్
సి. హర్యానా డి. రాజస్థాన్
47. సింధు ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పంటను పండించిన వారుగా ఖ్యాతి చెందారు?
ఎ. వరి బి. ప్రత్తి సి. బార్లీ డి. ఆవాలు
48. సింధూ ప్రజల ప్రధాన వృత్తి?
ఎ. వ్యవసాయం బి. పశుపోషణ
సి. వేట, ఆహారసంగ్రహణ
డి. చేతివృత్తులు, విదేశీ వాణిజ్యం
49. భూమిని దున్నిన గుర్తులు సింధు ప్రాంతంలో ఎక్కడ కనిపించాయి?
ఎ. లోథల్ బి. హరప్పా
సి. మొహంజోదారో డి. కాలిభంగన్
50. ఈ పురావస్తు శాఖ అధిపతి కింద హరప్పా నాగరికత తవ్వకాలు జరిగాయి?
ఎ. ఎస్.ఆర్.రావు బి. దయారామ్ సహాని
సి. ఆర్.డి. బెనర్జీ డి. జాన్ మార్షల్
51. గుప్తులు అధికార భాషగా దీన్ని ప్రకటించారు?
ఎ. సంస్కృతం బి. పాళీ
సి. ప్రాకృతం డి. ఏదీకాదు
52. గుప్త వంశంలో చివరి రాజు?
ఎ. విష్ణు గుప్తుడు బి. పురుష గుప్తుడు
సి. స్కంద గుప్తుడు డి. బుద్ద గుప్తుడు
53. గుప్త శకాన్ని ఇతను ప్రారంభించాడు?
ఎ. సముద్ర గుప్తుడు బి. కుమార గుప్తుడు
సి. మొదటి చంద్ర గుప్తుడు
డి. రెండవ చంద్ర గుప్తుడు
54. హుయాన్‌త్సాంగ్ ఇతని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు?
ఎ. హర్షుడు బి. కనిష్కుడు
సి. సముద్ర గుప్తుడు
డి. పైవారు ఎవరూ కాదు
55. కాళిదాసు రచన కానిది?
ఎ. మాళవికాగ్ని మిత్రం బి. రుతుసంహారం
సి. హరివంశం డి. కుమార సంభవం
సమాధానాలు
1. సి 2. డి 3. బి 4. సి 5. బి
6. డి 7. డి 8. డి 9. సి 10. సి
11. సి 12. బి 13. సి 14. డి 15. డి
16. డి 17. బి 18. బి 19.ఎ 20. బి
21. ఎ 22.డి 23. ఎ 24. డి 25. డి
26. సి 27. ఎ 28. బి 29. డి 30.డి
31. సి 32. బి 33. ఎ 34. డి 35. డి
36. సి 37. డి 38. ఎ 39. డి 40. బి
41. సి 42. ఎ 43. ఎ 44. ఎ 45. బి
46. ఎ 47. బి 48. ఎ 49. డి 50. డి
51. ఎ 52. ఎ 53. సి 54. ఎ 55. సి
Authorization