1. ప్రాచీన రాజ్యాల గురించి రాయండి.
జ: రాజనీతి శాస్త్రం గ్రీకు నగర రాజ్యాలలో ఆవిర్భవించింది. ఏథెన్స్, మెసిడోనియా, స్పార్టామిలాన్ నగరాలలో నాగరికత విరాజిల్లినట్లుగా రాజనీతి శాస్త్రవేత్తలు వివరించారు.
2. రాజనీతి శాస్త్రం ఏమైనా రెండు సాంప్రదాయక నిర్వచనాలను పేర్కొనండి?
జ: అ) గార్నర్ - రాజనీతి శాస్త్రం రాజ్యంతో ప్రారంభమై రాజ్యంతోనే అంతమవుతుంది.
ఆ) స్టీపెన్ లీకాక్ - ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం.
3. ఏవైనా రెండు రాజనీతి శాస్త్ర ఆధునిక నిర్వచనాలు తెల్పండి?
జ: అ) రాబ్సన్ - రాజనీతి శాస్త్రం ప్రధానంగా సమాజంలో అధికారానికి సంబంధించినది.
ఆ) హిల్మాన్ - రాజనీతి శాస్త్రం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎలా పొందుతారో అధ్యయనం చేసే శాస్త్రం.
4. ప్రభుత్వం.
జ: ఇది రాజ్యం యొక్క మూడవ లక్షణం. ప్రభుత్వం రాజ్యం యొక్క ప్రతినిధిగా ఉంటుంది. రాజ్యం తరుపున సౌర్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది. రాజ్యం తన ఆశయాలను ప్రభుత్వం ద్వారా నేరవేర్చుకుంటుంది.
5. రాజ్యం నిర్వచనాలు:
జ: అ) ఉడ్రోవిల్సన్ - ఒక నిర్ణీత భూభాగంలో శాసన బద్ధ మైన జీవితానికి సంఘటితం కాబడిన ప్రజా సముదా యమే రాజ్యం.
ఆ) బ్లంటె షీలీ - ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితం కాబడిన ప్రజా సముదాయమే రాజ్యం.
6. సమాజం.
జ: సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే సమాజం. వలలాగ అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను సమాజం అనే పదం సూచిస్తుంది.
7. రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరమా?
జ: అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభు త్వాన్ని ప్రపంచంలో ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగటంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పాడ్డాయి. రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు అనేది రాజ్య మౌలిక లక్షణం కాబట్టి రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరమే.
8. చట్టం పదవత్తాంతాన్ని వివరించండి?
జ: చట్టం అనే పదం అన్ని రకాల శాస్త్రాలలో వాడబడుతుంది. చట్టం అనే పదాన్ని ఆంగ్లంలో ''లా'' అంటారు. ఇది ప్రాచీన టైటానిక్ భాషలోని ''లాగ్'' అనే పదం నుండి ఉద్భవించింది.
9. చట్టానికి గల రెండు నిర్వచనాలు తెల్పండి.
జ: అ) ఎరిస్కిన్ - సార్వభౌముడి ఆదేశమే చట్టం.
ఆ) సాల్మండ్ - న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం.
10. సమన్వయ పాలన అంటే ఏమిటి?
జ: బ్రిటీష్ రాజ్యాంగ లక్షణాలలో సమన్వయ పాలన ఒకటి. ఈ భావన ప్రకారం చట్టం అనేది సాధరణంగా అందరికీ సమానంగా వర్తిస్తుంది. సమాంజలోని వివిధ వర్గాలకు భిన్నమైన చట్టాలు ఉండవని ఈ భావన సూచిస్తుంది.
11. పరిపాలక చట్టం?
జ: పరిపాలన ప్రశాతంగా కొనసాగించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రి స్తుంది. అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధిం చిన సంస్కరణలు తీసుకురావడంలో ఇది దోహద పడుతుంది.
12. రాజ్యంగ చట్టం : రాజ్యం యొక్క మౌలిక చట్టాన్ని రాజ్యాంగ చట్టం ఆంటారు. ఇది ప్రభుత్వ అంగాల మధ్య అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది.
13. సమత అంటే ఏమిటో నిర్వచించండి?
జ: సమత అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయ పదాలుగా వాడుతున్నారు. సమత అనేది సహజ న్యాయ భావన ద్వారా రూపొందింది. దీనినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడ మైనది.
14. స్వేచ్ఛ నిర్వచనాలు పేర్కొనండి?
జ: అ) హేయక్ -స్వేచ్చ అంటే బలప్రయోగం లేకపోవడం.
ఆ) సీలీ - మితిమిరీన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.
15. పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి?
జ: దీనినే వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది.
16. రాజకీయ స్వేచ్ఛ అంటే ఏమిటి?
జ: పౌరులు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించేదే రాజకీయ స్వేచ్ఛ. రాజకీయ స్వేచ్ఛ ను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు.
17. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి?
జ: ఒక వ్యక్తి తనకు కావల్సిన ఆహారాన్ని సమాకూర్చు కోవడానికి కావలిసిన స్వేచ్ఛనే ఆర్థిక స్వేచ్ఛ అంటారు. ఇది ఆర్థిక సంబంధమైన అభద్రతా భావం నుండి స్వాతంత్రాన్ని సూచిస్తుంది.
18. సాంఘిక సమానత్వం అంటే ఏమిటి?
జ: వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హౌదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి కూడా మతం, వర్గం, వర్ణం మొదలైన అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
19. హక్కులను నిర్వచించండి?
జ: అ) బొసాంకే - సమాజం చేత గుర్తించబడి, రాజ్యం చేత అమలు పరచబడే అధికారాలే హక్కులు.
ఆ)T.H. గ్రీన్ - ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వారికి కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.
20. హక్కుల వర్గీకరణ తెలపండి?
జ: హక్కులు మూడు రకాలు కలవు అవి..
అ) సహజ హక్కులు
ఆ) నైతిక హక్కులు
ఇ) చట్టబద్ధమైన హక్కులు
చట్టబద్ధమైన హక్కులు తిరిగి మూడు రకాలు కలవు
ఆ) పౌర హక్కులు ఆ) రాజకీయ హక్కులు
ఇ) ఆర్ధిక హక్కులు
21. నైతిక హక్కులు?
జ: నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాల ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులు అవకాశం కల్పిస్తాయి.
22. రాజకీయ హక్కులు?
జ: అ) ఓటు హక్కు
ఆ) ఎన్నికలో పోటీ చేసి హక్కు
ఇ) ప్రభుత్వ పదవుల చేపట్టే హక్కు
ఈ) విజ్ఞాపన హక్కు
23. బాధ్యతల వర్గీకరణ?
జ: అ) నైతిక బాధ్యతలు
ఆ) చట్టబద్ధమైన బాధ్యతలు చట్టబద్ధమైన బాధ్యతలు తిరిగి రెండు రకాలు. అవి
అ) సంవర్ధక బాధ్యతలు
ఆ) సంరక్షక బాధ్యతలు
24. నైతిక బాధ్యతలు.
జ: నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి రాజ్యం రూపొందించిన చట్టాలు మద్దతు ఇవ్వవు. ఇవి ప్రజలు నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి.
25. బాధ్యతలకు ఉదాహరణలివ్వండి?
జ: అ) రాజ్య విధేయత
ఆ) శాసన విధేయత
ఇ) పన్నులు చెల్లించడం
ఈ) శాంతిభద్రతల నిర్వహణలో సహకారం.
26. న్యాయాన్ని నిర్విచించండి?
జ: వ్యక్తి తన పని తాను చేసుకుంటూ ఇతరుల వ్యవహరా లలో జోక్యం చేసుకోక పోవడమే న్యాయం.
27. వితరణ శీల న్యాయం అంటే ఏమిటి?
జ: వ్యక్తుల మధ్య యోగ్యత ప్రాతిపదికపై వస్తు సంపదను రాజ్యం పంపిణి చేయడాన్ని వితరణశీల న్యాయం అని అంటారు. న్యాయం అంటే ఒక రకమైన వితరణ పద్ధతిగా అరిస్టాటిల్ వివరించాడు.
28. రాజకీయ న్యాయం అవగానేమి?
జ: రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులు అయిన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రసాదిస్తుంది.
29. సామాజిక లేదా సాంఘిక న్యాయం?
జ: చట్టం దష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది. పేదరికం, నిరు ద్యోగం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది
30. జస్, జంగేరి పద వత్తాంతాలను వివరించండి?
జ: కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తల ప్రకారం చట్టం అనే పదం లాటిన్ భాషలోని జస్, జంగేరి అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో ఈ రెండు పదాలకు బంధం అనే అర్థం ఉంది.
31. సహజ పౌరసత్వం పొందే రెండు పరిస్థితులు?
జ: అ) జస్సోలీ ఆ) జస్ సాంగ్వినస్
32 ద్వంద్వ పౌరసత్వం : పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివద్ధి చెందిన వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది.
33. ప్రజాస్వామ్యం : ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత - ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం అని అబ్రహం లింకన్ నిర్వచించాడు.
34. ప్రజాస్వామ్యం లక్షణాలు ఏవి?
జ: 1) ప్రజా ప్రభుత్వం 2) ప్రజల నియంత్రణ
3) ఎన్నికలు 4) ప్రజలకు జవాబుదారితనం
35. సహజ చట్టం:
జ: సహజ చట్టం అనేది ఏ ఒక్కరి చేత రూపొందించబడింది కాదు. ఇది భౌతిక శక్తి ఆధారంగా ప్రకతి చేత ప్రసాధించ బడింది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువు ను వినియోగించడాన్ని సహజ చట్టం అంటారు.
36. పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం : ప్రభుత్వ నిర్వహణలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా కొంత మంది ప్రజా ప్రతినిధులని ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వం కార్యాకలాపాలను నిర్వహించడాన్ని పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు.
37. లౌకికవాదం : లౌకికవాదం అంటే మత విశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన.
38. భారత దేశాన్ని లౌకిక రాజ్యంగా సమర్థించేందుకు 2 అంశాలు ఉదహరించండి?
జ: అ) భారతీయులందరూ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు కలిగి ఉండుట.
ఆ) మత పరమైన పన్నులు నిషేధించుట.
ఇ) చట్ట నిర్మాణంలో మత ప్రమేయం లేకుండుట.
39. రాజ్యంగం అంటే ఏమిటి? '' ప్రభుత్వం పనిచేసే విదానాన్ని తెలిపే నిర్దిష్టి నియమాల సముదాయమే రాజ్యాంగం '' అని లార్డ్ బ్రేస్ నిర్వచించాడు.
40. లౌకికరాజ్యం : మత ప్రమేయం లేని రాజ్యన్ని లౌకిక రాజ్యం అంటారు. దీనిలో అధికారిక మతం అంటూ ఏమిలేదు. అన్ని మతాలు సమానంగా ఆదరించ బడతాయి. మత పరమైన పన్నులు నిషేధం.
41. మతస్వామ్యం : మతస్వామ్యం అంటే 'భగవంతుడి పాలన' అని అర్థం. ఆచరణలో మతస్వామ్యం అంటే మతాచార్యుల పాలన. భగవంతుడి నుంచి సర్వాధి కారాలు సంక్రమిస్తాయనే సిద్ధాంతంపై ఈ భావన రూపొందింది.
42. శాసనాత్మక రాజ్యాంగం : దీనిని సాంప్రదాయక రాజ్యంగమని కూడా ఈ తరహా రాజ్యాంగం ఉద్దేశ్య పూర్వకంగా రూపొందుతుంది. దీనిని సార్వభౌమాధి కారం గల రాజు లేదా పార్లమెంటు రూపొందిస్తారు.
43. రాజ్యాంగ సవరణ పద్ధతి
జ: ఆ) కఠినమైన పద్ధతి
ఆ) సరళమైన పద్ధతి
ఇ) పాక్షిక కఠినమైన పద్ధతి
ఈ) పాక్షిక సరళమైన పద్ధతి.
44. అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ
జ: అరిస్టాటిల్ ప్రకారం రాజరికం, కులీన పాలన, మధ్య తరగతి పాలన అనేవి మంచి ప్రభుత్వాలు. నిరంకు శత్వం, అల్పజన పాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు.
45. పరిణామ్మాతక రాజ్యాంగం: పరిణామాత్మక రాజ్యాం గాన్ని క్రమానుగత రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. అనేక పరిణమాల పర్యవసానంగా ఇటువంటి రాజ్యాంగం రూపొందుతుంది. కొన్ని రాతపూర్వక ప్రతుల సంపుటిగా రాజ్యాంగాన్ని భావిస్తారు.
46. కులీన స్వామ్యం : సమాంజంలోని కొద్దిమంది వ్యక్తులు, వారి పుట్టుక, శక్తి సామర్థ్యాలు, సంపద హౌదాల పరంగా రాజ్యాధికారంలో ఉన్నట్లయితే ఆది కులీన స్వామ్యం .
47. అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని క్లుప్తంగా రాయండి?
ఈ సిద్ధాంతాన్ని మాంటెస్క్యూ అనే రచయిత ప్రతిపాదిం చాడు. దీని ప్రకారం ప్రభుత్వం యొక్క సర్వ అధికారాలు ప్రభుత్వ అంగాల మధ్య విభజించాలి. ప్రతి ప్రభుత్వాంగం వేరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు.
- వి.శేషారావు
సివిక్స్ లెక్చరర్
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
దోమకొండ, కామారెడ్డి జిల్లా