Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు 'తెగిపోవటం' అమె రికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రధాన చర్చనీయాంశమైందని ఒక వ్యాఖ్యాత అన్నాడు. ఈ రెండు దేశాలు ఒక 'నూతన ప్రచ్ఛన్న యుద్ధం' లో మునిగిపోయాయి. పసిఫిక్‌పై ఒక 'ఉక్కు తెర'ను చైనా దించిందని అమెరికా మాజీ ఆర్థిక కార్యదర్శి హాన్క్ పాల్సన్ పేర్కొన్నాడు. అమెరికా రక్షిత విధానాలను అవలంబించటం వల్ల ప్రపంచంలోని ఈ రెండు అతి పె ద్ద ఆర్థిక వ్యవస్థల మధ్యగల అనేక రకాల ఆర్థిక సంబంధాలను ట్రంప్ పా లన తెగ్గొడుతున్నది. అయితే అలాంటి 'తెగతెంపులు' 21వ శతాబ్దపు ప్రపం చీకరింపబడిన ఆర్థిక వ్యవస్థను ఏ విధం గా ప్రభావితం చేయనున్నాయో గత వారంలో జరిగిన సంఘటనలు సూచిస్తున్నాయి. జర్మనీ, చైనా, జపాన్ దేశాలలో షేర్ల ధరలు, సరుకుల ధరలు పడిపోతున్నా యి. వినియోగ వ్యయం కుంచించుకు పోతోంది. కార్మికులు ఉద్యోగాలు కోల్పో తున్నారు. ఆటో తదితర పరిశ్రమలు మూతపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని మాంధ్యం అమెరికాకు వ్యాపిస్తోందని అమెరికా పాలకవర్గాలు భయపడుతున్నాయి. గత పదహారేండ్లలో మొట్టమొదటిసారిగా ప్రపంచం లో అత్యంత లాభసాటి కంపెనీ ఆపిల్ రాబోయే ఏడాదికి తన అమ్మకపు లక్ష్యాలను కుదించుకుంటున్నట్టు ప్రకటిం చింది. అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా చైనాలో మాంధ్యం ఏర్పడబోతున్నదనే విషయాన్ని అందుకు కారణంగా ఆపిల్ చెబుతోంది. ఈ ప్రకటన వెలువడగానే డౌ మార్కెట్ 660పాయింట్లు పడిపోయింది. ఇది 1930వ దశకం తరువాత అత్యంత కనిష్టస్థాయికి మార్కెట్ దిగజారిందనే విషయాన్ని తెలియజేస్తోంది. డాట్ కాం బబుల్ పతనం తరువాత ఒక నూతన వాణిజ్య సంవత్సరంలో మొదటి రెండు రోజులు ఇంత దయనీయంగా ఎప్పుడూ లేవు.
చైనాపై చేస్తున్న వాణిజ్య యుద్ధం కారణంగా చైనాతోపాటు అమెరికాలోనూ మాంధ్యం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం తరువాత పారిశ్రామిక కార్యకలాపాలు ఒక నెలలో ఇంతగా పడిపోవటం ఇదే తొలిసారని ఐఎస్ఎమ్ పారిశ్రామిక సూచిక తెలియజేస్తున్నది. సుధీర్ఘ కాలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమేణా బలహీనపడటాన్ని, రాబోయే కాలంలో చైనా, ఇతర వర్ధమాన దేశాలతోపాటు అమెరికాకు మరింత లోతైన మాంధ్యం ఎదురయ్యే అవకాశాన్ని ఈ పరిస్థితి సూచిస్తున్నది. అటువంటి మాంధ్యానికి అంతర్జాతీయ స్వభావం ఉంటుంది. సదరు సంక్షోభానికి కారణభూతమైన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించకపోవటంతో అప్పటికంటే మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఏర్పడింది. బ్యాంకుల బ్యాలన్స్షీట్స్లో వున్న లోటును కేంద్రబ్యాంకు పరిమాణాత్మక వెసులుబాటు(క్వాంటిటేటివ్ ఈజింగ్), అత్యంత కనిష్ట వడ్డీరేట్లతో పూడ్చింది. 2008వ సంవత్సరం తరువాత ఆర్థిక పునరుత్తేజానికి కావాల్సిన ఆర్థిక వనరులను ప్రపంచ రుణాన్ని విస్తృతం చేయటంద్వారా సమకూర్చారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్ఎఫ్) గత నెలలో ప్రచురించిన లెక్కల ప్రకారం ఈ రుణం చరిత్రలో ఎన్నడూలేనంత స్థాయిలో 184ట్రిల్లియన్ డాలర్లు(ఒక ట్రిల్లియన్ డాలర్లు రూ.70లక్షల కోట్లకు సమానం)గా ఉంది.
అయితే 2008సంక్షోభం సందర్బంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ పరస్పరం సహకరించుకుని వాణిజ్య యుద్ధాన్ని నివారించగలిగాయి. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చైనాపైన, ఐరోపా ఖండంలోని మిత్రదేశాలతోసహా అనేక దేశాలపైన అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇటువంటి వాణిజ్య యుద్ధాలు తీవ్రమై 1930వ దశకంలో ప్రపంచాన్ని కుదిపిన మహామాంధ్యం స్థాయి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాల మధ్య చెలరేగుతున్న పోటీ ఫలితంగా వాణిజ్య, సైనిక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలు పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రపంచ ఉత్పత్తికి, జాతి రాజ్యానికి మధ్య గల మౌలిక వైరుధ్యాలు తీవ్రం కావటాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక జీవితం, ప్రపంచ ప్రజల పరస్పర సంబంధాలు, విజ్ఞానశాస్త్ర పరిశోధనలు చరిత్రలో ఎన్నడూలేనంత అంతర్జాతీయంగా కలగలిసి సాగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పాలకవర్గాలు జాతీయ వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నాయి. సైనిక సంపత్తి సమకూర్చుకుంటున్నాయి.
2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభభారాన్ని పాలకవర్గాలు కార్మికవర్గం భరించేలా చేశాయి. బ్యాంకులకు ఇచ్చిన ఉద్దీపనలు, నియంత్రణలు ఎత్తివేయటం, పన్ను రాయితీల వంటి చర్యల కారణంగా ద్రవ్య పెట్టుబడిదారుల పెట్టుబడులు రెండు, మూడు రెట్లు పెరిగాయి. అదే కాలంలో కార్మికవర్గానికి అందుతున్న వేతనాలు క్షీణించాయి లేదా స్థబ్దంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభ కాలంలో ప్రజలపై నిర్దాక్షిణ్యంగా రుద్దిన మిత వ్యయ విధానాన్ని వర్తమానంలో మరింత కౄరంగా అమలు చేయటం జరుగుతుంది.
అయితే గత దశాబ్ద కాలంలో సంక్షోభంతోపాటు వర్గ పోరాటం కూడా తీవ్రమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో అనేక పోరాటాలు జరిగాయి. అమెరికా నుంచి లాటిన్ అమెరికా దాకా, ఆ తరువాత బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, శ్రీలంక, ఇండియా దాకా ప్రజాపోరాటాలు విస్తృతంగా సాగాయి. పెట్టుబడిదారీ వాస్తవికతను అధిగమించటంలోనే మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు అంతిమ పరిష్కారం ఉందని గ్రహించే దిశగా ఈ పోరాటాలను కొనసాగించటమే నేటి కర్తవ్యం.