Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-4కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందన్న ప్రోమో కూడా విడుదల కాగా, ఇప్పుడు హౌస్ లో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 30 నుంచి నాలుగో సీజన్ ప్రారంభమై, దాదాపు 100 రోజుల పాటు జరుగుతుందని తెలుస్తుండగా, కంటెస్టెంట్లుగా చాలామంది సెలబ్రిటీల పేర్లే వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ లు కరోనా,లాక్ డౌన్ కారణంగా ఆగిపోవడంతో పలువురు ప్రముఖులు ఈ సీజన్ హౌస్ లోకి వెళ్లనున్నారని, దీంతో ఈ ప్రోగ్రామ్ రక్తి కడుతుందని అంచనా. ఇక నాలుగో సీజన్ హౌస్ ఎలా ఉండబోతుందో, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ వీడియోను చూసి మీరూ తెలుసుకోవచ్చు.