Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ కెటీఎం, తమ కెటీఎం 250 డ్యూక్‌ను ఆధునీకరించింది. ఆవిష్కరణ నాటి నుంచి పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ విభాగంలో ఈ క్వార్టర్ లీటర్ చాంఫియన్ బలీయమైన ప్లేయర్‌గా నిలిచింది. ఇప్పుడు ఇది డీఆర్ఎల్తో దూకుడైన శైలి కలిగిన పూర్తి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, సూపర్మోటో మోడ్‌తో డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్బీ పూర్తి సరికొత్త రంగులు ఉ డార్క్ గాల్వానో, సిల్వర్ మోటాలిక్ మరియు ఒన్ టచ్ స్టార్ట్ ఫంక్షనాలిటీతో అప్‌గ్రేడ్ చేయబడింది. క్వార్టర్ లీటర్ కెటీఎం 250 డ్యూక్‌లో గరిష్ట సవారీ ఆనందాన్ని, వాంఛనీయ వినియోగదారుల విలువతో మిళితం చేశారు మరియు అతి చురుకైన నిర్వహణ పరిగణలో ఉన్నచోట దీనిని అధిగమించడం కష్టం. అతి తేలికైన, శక్తివంతమైన మరియు అత్యాధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఇది అద్వితీయమైన సవారీ అనుభవాలను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ అందిస్తుందన్న భరోసా అందిస్తుంది. అత్యున్నత శ్రేణి విడిభాగాలైనటువంటి ఓపెన్ఉక్యాట్రిడ్జ్ అప్ సైడ్ డౌన్ డబ్యుపీ ఫోర్క్స్, స్లిప్పర్ క్లచ్, ప్రీ లోడ్ ఎడ్జస్టబుల్ మోనో షాక్స్ వంటివి ఈ బైక్‌ను అతి చురుగ్గా మార్చడంతో పాటుగా 30 పీఎస్ శక్తి మరియు 24 ఎన్ఎం టార్క్‌ను ఇవి కలిగి ఉంటాయి. బీఎస్6 కెటీఎం 250 డ్యూక్‌ను దీనియొక్క డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సెటప్‌లో సూపర్మోటో మోడ్‌తో అప్‌గ్రేడ్ చేశారు. అత్యాధునిక సూపర్మోటో మోడ్‌తో ఒక్క బటన్ నొక్కగానే యాక్టివేట్ చేయబడుతుంది, ఉద్వేగపూరిత సవారీ అనుభవాలను కోరుకునే వారు ఈ జోడించిన వినోదాన్ని మరియు అదనపు రేస్ట్రాక్ నియంత్రణను అభిమానిస్తారు. ఫ్రంట్ బ్రేక్‌పై ఏబీఎస్ను మాత్రమే సూపర్మోటో వ్యవస్థ నియత్రిస్తుంది. వెనుక బ్రేక్ ఒత్తిడి మొత్తం రైడర్ యొక్క కుడి పాదం మీద ఆధారపడి ఉంటుంది, ఇది మీ సవారీ నైపుణ్యాన్ని సంపూర్ణ పరిమితికి నెట్టడానికి ఇది అనుమతిస్తుంది.
కెటీఎం 250 డ్యూక్‌పై ఆకర్షణీయమైన డీఆర్ఎల్తో యాగ్రెసివ్ శైలితో తీర్చిదిద్దిన స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఈ బైక్ డిజైన్‌లో మరో ఆకర్షణ మరియు దీనిపెద్ద అన్న కెటీఎం 1290 సూపర్ డ్యూక్ ఆర్‌ను స్పష్టంగా స్ఫురించేలా చేస్తుంది. ప్రాక్టీకల్‌గా ఉంటూనే, అర్థవంతమైన ఆకర్షణగా ఉండే ఈ లైట్ అసాధారణ విజిబిలిటీని అతి తక్కువ కాంతి లేదా చీకటి పరిస్థితులలో సైతం అందిస్తుంది.
కెటీఎం 250 డ్యూక్‌లోని కాంటాక్ట్‌లెస్ క్రాంకింగ్ ఫీచర్, ఒన్ టచ్ స్టార్ట్ (గతంలో కోల్డ్ స్టార్ట్)ను సాధ్యం చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్‌ను ఒక్కసారి నొక్కగానే ప్రారంభమవుతుందన్న భరోసా అందిస్తుంది. ఇప్పుడు అద్వితీయమైన అనుభవాలను ఆస్వాదించడం ఒక్క బటన్ దూరంలో ఉంది.
కెటీఎం 250 డ్యూక్ ఇప్పుడు రెండు రంగుల నేపథ్యాలు ఉ డార్క్ గల్వానో మరియు సిల్వర్ మెటాలిక్ లలో వస్తుంది. ఈ బైక్ ధర 2,09,280 రూపాయలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)
ఈ సందర్భంగా సుమీత్ నారంగ్, అధ్యక్షులు (ప్రోబైకింగ్)ఉబజాజ్ ఆటో లిమిటెడ్ మాట్లాడుతూ ప్రీమియం స్పోర్ట్మోటార్సైకిల్ విభాగంలో ఔత్సాహికుల కోసం కెటీఎం 250 డ్యూక్ స్టాండవుట్ క్వార్టల్ లీటర్ మోటార్‌సైకిల్ లభ్యమవుతుంది. కెటీఎం యొక్క సాటిలేని రేసింగ్ వారసత్వపు స్ఫూర్తితో ఈ వాహనం తీర్చిదిద్దబడింది. ఇది హైటెక్ రేస్ రెడీ ఇంజిన్, విడిభాగాలతో వస్తుంది. క్వార్టర్ లీటర్ కెటీఎంగా ఇది అత్యుత్తమ బైకింగ్ పనితీరు, నగర ప్రాక్టికాలిటీని అందిస్తుంది. కెటీఎం 250 డ్యూక్‌పై ఈ అప్‌గ్రేడ్స్, బైకింగ్ ప్రేమికుల నడుమ మరింతగా దీని అప్పీల్‌ను వృద్ధి చేస్తుంది అని అన్నారు.
దీనియొక్క రెడీ టు రేస్ సిద్ధాంతానికి కట్టుబడి, కెటీఎంకు సాటిలేని వారసత్వం మోటార్‌స్పోర్ట్స్‌లో ఉంది. 1953 నుంచి 66 సంవత్సరాల వ్యవధిలో 300కు పైగా ప్రపంచ చాంఫియన్షిప్లు సాధించింది. భారతదేశంలో 2012లో ప్రవేశించిన నాటి నుంచి కెటీఎం తమ ఉనికి 365 నగరాలలో 460 స్టోర్లకు వృద్ధి చేసింది. కెటీఎంకు 2.7 లక్షల మంది బైకింగ్ ప్రేమికులతో బలీయమైన కమ్యూనిటీ భారతదేశంలో అతి తక్కువ సమయంలో ప్రీమియం స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ విభాగంలో ఉంది.