Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఓ యువతి మద్యం మత్తులో హంగామా చేసింది. రహ్మత్ నగర్ పోలీస్ అవుట్‌పోస్టు సమీపంలోని పార్కు వద్ద నగ్నంగా చిందులేసింది. గమనించిన అవుట్‌పోస్టు మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు దుస్తులు వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాటిని సైతం యువతి చింపేసింది. దీంతో పోలీసులు మరోసారి ఆమెకు దుస్తులు అందించారు. కూకట్‌పల్లికి చెందిన ప్రియుడు భరత్ తనను మోసం చేశాడని యువతి వాపోయింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడికి ఫోన్ చేసింది. అనంతరం ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువతికి మద్యం మత్తు దిగే వరకు ఆశ్రయం ఇచ్చిన పోలీసులు అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.