Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. మున్నా ఈ చిత్రానికి దర్శకుడు. జనవరి 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేమకథ, పునర్జన్మల కాన్సెప్ట్‌తో సాగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎస్వీ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.