ఆన్‌లైన్ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని
Tue 02 Mar 21:22:23.461479 2021
హైదరాబాద్ : ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. బండ్లగూడ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బండ్లగూడలోని ద్వారకానగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ఉదయం ఆన్‌లైన్ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి బయటకు రాలేదు. గంటలు గడుస్తున్నా గదిలో అలికిడి లేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి అన్నికోణాల్లో విచారిస్తున్నారు.