కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న కొద్ది సేపటికే మృతి
Wed 03 Mar 08:06:31.81717 2021
హైదరాబాద్ : మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి చెందాడు. థానే జిల్లా భీవండిలోని ఓ హాస్పిటల్‌లో కరోనా వ్యాక్సిన్ రెండో మోతాదు తీసుకున్న కొద్ది సేపటికే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైద్యుడికి డ్రైవర్‌గా పని చేస్తున్న సుఖ్దీయో కిర్దిట్ మంగళవారం ఉదయం 11 గంటలకు వ్యాక్సిన్ తీసుకొని కొద్ది సేపు టీకా కేంద్రంలోని వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత తలతిరగంతో వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అతన్ని సమీపంలోని ఐజీఎం హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారని ఓ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం సదరు వ్యక్తి మరణానికి కారణం తెలుస్తుందని భీవండి నిజాంపురా మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ కేఆర్ ఖరత్ తెలిపారు.