హైదరాబాద్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఎస్‌యూవీ ఢీకొన్న ఘటనలో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌యూవీలో 27 మంది ఉన్నట్లు జాతీయ రహదారి గస్తీ బృందం అధికారి వాట్సన్ తెలిపారు. మృతులంతా వ్యవసాయ కూలీలై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.