శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
Wed 03 Mar 11:58:55.48464 2021
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్‌కు FZ-8779 నంబరు గల విమానంలో వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి 1593 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి, పట్టుకున్నారు. బంగారం విలువ రూ.74.87 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సదరు మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే రూ.4లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.