Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ కంటేశ్వర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ఆవరణంలోనీ లైబ్రరీ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ సెక్రటరీ పి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని అంబేద్కర్ గొప్ప సంస్కరణ కర్తగా మహా మేధావి అని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి శశిధర్ రెడ్డి న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్ ఆశ నారాయణ ఉదయ్ కృష్ణ బిట్ల రవి సంతోష్ బంటు వసంత్ క్లబ్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.