Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి డా.అంబేద్కర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రూపుదిద్దుకునే ప్రక్రియకు అంబేద్కర్ స్ఫూర్తి కారణమని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా హోం మంత్రి గుర్తు చేశారు.