Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వారం రోజుల్లో ఎన్ని చాలన్లో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ వాహనదారులు అరుదైన రికార్డు సృష్టించారు. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు. కేవలం వారం రోజుల్లోనే దాదాపు 2 కోట్ల ట్రాఫిక్ చాలన్లు కట్టి రికార్డు క్రియేట్ చేశారు. కేవలం వారంలో రోజల్లోనే ఇన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కావడం అధికారులను కూడా ఆశ్చర్యనికి గురిచేస్తోంది. జనవరి 15 నుంచి 21వ వరకు కేవలం వారం రోజుల్లోనే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు 39 వేలకు పైగా కేసులు నమోదు చేయగా, ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై మొత్తం రూ.1.70 కోట్ల జరిమానా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ల దగ్గర నుంచి వసూళు చేశారు.
కేర్లేస్ డ్రైవింగ్, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కేసులు ఈ వారం రోజుల్లో పెద్ద సంఖ్యలో నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ వారం రోజుల్లో మొత్తం 39,858 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు వివిధ ఉల్లంఘనల కోసం నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులుగాను దాదాపు రూ.1,75,58,415 జరిమానా విధించబడ్డాయి. ఈ వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా భారీగానే నమోదు అయినట్లు పోలీసుల డేటా చెబుతుంది. ఈ కేసుల్లో బుక్ చేయడ్డవాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి దాదాపు 118 మందిని కోర్టులో హాజరుపరచగా, మొత్తం రూ.3.40 లక్షల జరిమానా, ఒకరికి జైలుశిక్ష విధించినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత వారం రోజుల్లో మొత్తం 78 రోడ్డు ప్రమాదాలు జరగగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.