లిమెరిక్ (ఐర్లాండ్) : 66 ఏండ్ల ఐరిష్ వృద్ధుడు తన భార్యతో శృంగారం చేసిన తర్వాత గతం మర్చిపోయాడు. ఈ ఘటన ఐర్లాండ్ లో వెలుగు చూసింది. ఐరిష్ మెడికల్ జర్నల్ మే ఎడిషన్‌లో ఈ విషయాన్ని ప్రచురించింది. 66 ఏండ్ల వృద్ధుడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. తర్వాత 10 నిమిషాల తర్వాత మతిమరుపు బాధపడ్డాడు. దాంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను చిన్నతనం నుంచి జరిగిన ఘటనలన్నీ మర్చిపోలేదు. సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు. తన పెండ్లి రోజు సెలబ్రేట్ చేసుకోలేదని చాలా బాధ పడిపోయాడు. భార్యకు ఏడుస్తూ క్షమాపణలు చెప్పాడు అయితే అతని భార్య.. పెండ్లి రోజు వేడుక చేసుకున్నామని చెప్పింది. అయినా అతను నమ్మలేదు. దాంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతనికి ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్లు తేల్చారు. నిపుణులు మాట్లాడుతూ.. అతని సమస్యను టీజీఏ (ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా) అని చెప్పారు. కొన్నిసార్లు శారీరకంగా తీవ్రమైన శ్రమ చేసినప్పుడు గతంలో జరిగిన ఘటనలను మర్చిపోతారని చెప్పారు. కొన్ని గంటల తర్వాత మళ్లీ అవి గుర్తుకొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల పెద్దగా సమస్యలు ఉండవని అన్నారు. అయితే బాధితులు, వాళ్ల కుటుంబ సభ్యులు డిప్రెషన్‌కు గురవుతారని తెలిపారు. ఏడేండ్ల క్రితం కూడా అతను ఇలాగే మతిమరుపుతో బాధపడినట్టు తెలిసింది.