Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల కోసం కొత్త టోల్ ఫ్రీ నంబర్ 1800 1234 ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఖాతాలో ఉన్న నగదు నిల్వ, ఇంతకు ముందటి 5 లావాదేవీలు, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కులకు సంబంధించిన వివరాలు, బ్లాక్ చేయడం, కొత్త వాటి కోసం దరఖాస్తు చేయడం వంటివన్నీ చేసుకోవచ్చని స్టేట్ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సేవలు వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటూ అందుబాటులో ఉంటాయి. ఇక ఇప్పటికే ఉన్న ఇతర టోల్ ఫ్రీ నంబర్లు కూడా యథాతథంగా కొనసాగుతాయని స్టేట్ బ్యాంకు పేర్కొంది.
SBI తన వెబ్సైట్లో ఇలా పేర్కొంది, " ఎస్బీఐ సేవల కోసం 24X7 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయండి అంటే, 1800 1234 (టోల్-ఫ్రీ), 1800 11 2211 (టోల్-ఫ్రీ), 1800 425 3800 (టోల్-ఫ్రీ), 1800 నుండి 21 వరకు), లేదా 080-26599990కు కాల్ చేయొచ్చు. దేశంలోని ఏదైనా ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ ఫోన్ నుండి టోల్-ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు."