Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతీ ఎయిర్ టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. మొదటి ప్లాన్ ధర రూ. 519 కాగా.. రెండో ప్లాన్ ధర రూ. 779.
రూ.519 ప్లాన్ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజూ ఒకటిన్నర జీబీ చొప్పున రెండు నెలల్లో 90 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. పలు ఇతర ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రూ.779 ప్లాన్ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 135 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా వర్తిస్తాయి. ఇతర ప్రయోజనాలు రూ. 519 ప్లాన్ లాగానే ఉంటాయి.