Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్‌పై లైంగికదాడి కేసు నమోదైంది. రాహుల్ జైన్ ముంబై నగరంలోని తన ఫ్లాట్‌లో 30 ఏండ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్పై లైంగికదాడి చేశాడని ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదును పోలీసులు రికార్డ్ చేశారు. ఆమె తన స్టేట్మెంట్లో రాహుల్ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించారని తన పనిని మెచ్చుకున్నారని చెప్పారు. అనంతరం సబర్బన్ అంధేరిలోని ఎత్తయిన భవనంలో ఉన్న తన ఫ్లాట్‌ను సందర్శించాల్సిందిగా రాహుల్ కోరాడని బాధితురాలు తెలిపారు. తన వ్యక్తిగత కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌గా నియమిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఆగస్ట్ 11న రాహుల్ ఇంటికి వెళ్లిన తర్వాత తన వస్తువులను చూపిస్తానన్న నెపంతో తనతోపాటు పడక గదిలోకి రమ్మని చెప్పి తనపై లైంగికదాడి చేశాడని, తాను ప్రతిఘటించడంతో దాడి చేశాడని, ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధిత మహిళ ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా పనిచేస్తున్నారని ముంబై పోలీసులు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు రాహుల్‌పై భారత శిక్షాస్మఅతి (ఐపిసి) సెక్షన్లు 376 (రేప్)- 323 (స్వచ్ఛందంగా గాయపరచడం)- 506 (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.