Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పనిచేస్తున్న ఓ యువకుడిని చర్ల పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ఎస్సై రాజువర్మ పోలీస్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్‌తో కలిసి మండల పరిధిలోని కలివేరు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ఓ వ్యక్తి తచ్చాడుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా సదరు యువకుడు మిలీషియా సభ్యుడని తెలిసింది. యువకుడిని చర్ల మండలం తిప్పాపురం గ్రామ పంచాయతీ రాళ్లాపురం గ్రామానికి చెందిన మూసిక దేవయ్యగా గుర్తించారు. దేవయ్యను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. దేవయ్యకు గతంలో చర్ల మండలంలో జరిగిన విధ్వంసాలకు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.