Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్ ఖాన్లతీఫ్ఖాన్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భవనంలో పని చేస్తున్న వారిని బయటకు పంపించారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేస్తున్నారు.