Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నటి లక్ష్మి రాయ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ'. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్ను మంగళవారం విడుదల చేశారు. వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందించినట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. కానీ శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. ట్రైలర్ చివర్లో కాస్త యాక్షన్ను కూడా జోడించారు. హారర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా నవ్విస్తాయి. ఈ సినిమాలో పూజిత పొన్నాడ, ప్రవీణ్, కార్తిక్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిశోర్ సినిమాకు దర్శకత్వం వహించారు. హరి గౌర సంగీతం సమకూర్చారు. ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో రాయ్ లక్ష్మి టీచర్ పాత్రను పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు అమలాపురంలో జరిగింది.