Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బ్రాండ్ అయిన ఇండేన్ గ్యాస్‌కు సంబంధించిన స్థానిక డీలర్ల వెబ్‌సైట్‌లోని లోపాల వల్ల 58 లక్షల మంది వినియోగదారుల ఆధార్ నంబర్లు బహిర్గతం (లీక్) అయ్యాయని ఫ్రెంచ్ పరిశోధకుడు బాప్టిస్టే రాబర్ట్ చెప్పారు. ఎలియట్ అల్డెర్సన్ పేరుతో రాబర్ట్ ట్విటర్ హ్యాండిల్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక యూజర్‌నేమ్, పాస్వర్డ్ సహాయంతో 67 లక్షల మంది ఇండేన్ గ్యాస్ డీలర్లు, పంపిణీదారులు, వినియోగదారుల ఆధార్ సమాచారం చూడొచ్చని వెల్లడించారు. స్థానిక డీలర్ల పోర్టల్‌లో ధ్రువీకరణ లేకపోవడం వల్ల ఇండేన్ ఖాతాదారుల పేర్లు, చిరునామాలు, ఆధార్ నంబర్లు బహిర్గతం అవుతున్నాయి అని వెల్లడించారు. నేను ఓ పైథాన్ స్క్రిప్ట్ రాశాను. ఈ స్క్రిప్ట్‌తో 11,062 మంది డీలర్ల ఐడీలు పొందాను. ఒక రోజు తర్వాత నా స్క్రిప్ట్ 9,490 మంది డీలర్ల వద్ద ఉన్న సమాచారాన్ని పరీక్షించింది. మొత్తం 58,26,116 మంది ఖాతాదారుల సమాచారం బహిర్గతం అయింది అని వివరించారు. ఆ తర్వాత ఇండేన్ నా ఐపీ ని బ్లాక్ చేసింది. అందువల్లే మిగతా 1,572 మంది డీలర్ల వివరాలను పరీక్షించలేకపోయాను అని చెప్పారు.