Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మూడు నెలల క్రితం తండ్రయిన విషయం తెలిసిందే. రోహిత్- రితికా దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈమెకు సమైరా అని నామకరణం కూడా పెట్టారు. అయితే మ్యాచ్లు లేని సమయంలో రోహిత్ తన విలువైన సమయాన్ని తన ముద్దుల కూతురికే కేటాయిస్తుంటాడు. వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా సమైరాకు రోహిత్ జోలపాట పాడుతున్న వీడియోను అతడి భార్య రితికా ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.రోహిత్ పాడింది నిజంగా జోల పాట కాదు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం గల్లీబాయ్ పాటను రోహిత్ లాలిపాటగా పాడుతున్నాడు.