Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ చితక్కొడుతోంది. ఇద్దరు ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో అర్ద సెంచరీలు పూర్తి చేశారు. 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసిందంటే హైదరాబాద్ ఆటగాళ్ల దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోతున్నాడు. బౌలర్ల పనిపడుతున్నాడు. మరో ఓపెనర్ బెయిర్‌స్టో కూడా అతడికి అండగా విరుచుకుపడుతున్నాడు. వీరి దెబ్బకు కేసీ కరియప్ప ఒక్క ఓవర్లోనే 20 పరుగులు సమర్పించుకున్నాడు. యర్రా పృథ్వీరాజ్ 16 పరుగులు ఇచ్చుకున్నాడు. వార్నర్ 55, బెయిర్‌స్టో 54 పరుగులతో ఉన్నారు.