Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టిక్ టాక్ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అలాగే గూగుల్ ప్లేస్టోర్లో టాప్ డౌన్లోడ్స్ యాప్లో ఇది టాప్లో ఉంది. భారత్లో దాదాపు 30 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అయితే టిక్ టాక్ లో తమ వీడియోలకు లైక్స్ కోరలకు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు తమలోని టాలెంట్ యాక్టింగ్, డ్యాన్స్, కామెడి, ఇలా వారికోచ్చిన టాలెంట్ బట్టి వారికి లైక్స్ వస్తున్నాయి. మరికొంత మంది మాత్రం ఎదో ఒక విన్యాసం చేసి లైక్ లు తెచ్చుకుంటున్నారు. ఇలా టిక్ టాక్ లో లైక్ లు కోరకు ఎలా కష్టపడుతున్నారు అన్ని 'మై విలెజ్ షో' యూటుబ్ ఛానల్ వారు ఒక వీడియో చేశారు. అందులో లైకుల కోసం ఎలా కష్టాపడ్డారు చివరికి ఏం అయ్యింది అని ఫన్నిగా చూపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.