Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూగో: తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామస్థులు అల్లవరం పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. గత రెండు రోజుల క్రితం వైసీపీ పార్టీకి చెందిన ఫ్లెక్సీని చింపారనే నెపంతో గ్రామానికి చెందిన కొందరు యువకులకు అరెస్ట్ చేశారని, అమాయక యువకులను హింసిస్తున్నారని గ్రామస్థులు స్టేషన్ ను చుట్టుముట్టారు. భయంతో పోలీసులు స్టేషన్ తలుపులు మూసుకున్నారు. అమలాపురం సీఐ కల్పించుకొని తప్పుచేయకపోతే యువకులను వదిలేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనక్కు తగ్గారు.