Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూ కశ్మీర్: బాలికలు తమ ఆత్మ రక్షణ కోసం జమ్మూలోని రాజౌరీ జిల్లాలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ 19, 20 తేదీల్లో నిర్వహించారు. 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. రాజౌలీ జిల్లా డెవెలెప్మెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బాలికలు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. బాలికలు శారీరకంగా దృఢంగా ఉంటే ఆకతాయిలు తమ దగ్గరికి రారని ఆయన అన్నారు. బాలికలు ఎప్పటికప్పుడూ శారీరక వ్యాయామాలు, యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారని వారు తెలిపారు.