Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వేగంగా వెళ్తున్న యువకుడికి కుక్క అడ్డం వచ్చింది. దీంతో కుక్కను తప్పించబోయిన యువకుడు అదుపుతప్పి కుక్కను ఢీకొట్టి ఆపై డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కుక్క కూడా మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో వాహనదారునికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.