Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు నిరాకరించకూడదని, అలా నిరాకరిస్తే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక బస్సుల ద్వారా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కరోనాపై ప్రజలను నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లపై వచ్చే వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.