Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ నేషనల్స్ ఎంపికకు జంప్స్, హార్డిల్స్, స్టీపుల్ చేస్ ఈవెంట్స్ విభాగాల్లో గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ ట్రయల్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టాన్లీ, సెక్రెటరీ సారంగపాని, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేష్, సెక్రెటరీ భాస్కర్‌రెడ్డి, నిర్మల్ డిస్ట్రిక్ట్ సెక్రెటరీ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.