Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వనస్థలిపురం
ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరిం చడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన సోని అనే యువతి మల్లికార్జున్‌నగర్‌కు చెందిన అన్వర్‌తో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని అన్వర్ మాటివ్వడంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. యువతి సోని గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని అన్వర్‌ను ఒత్తిడి చేసింది. దీంతో అన్వర్ సోనితో మాట్లాడటం మానేయటం, కలువకుండా ఉండటంతో గురువారం ఉదయం మల్లికార్జున్‌నగర్‌లోని అన్వర్ ఇంటి ముందు సోని ఆందోళన చేసింది. దీంతో ఇంటికి తాళం వేసిన అన్వర్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించిన సోని ఉన్నట్టుండి తన వద్ద ఉన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోనిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.