Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ యాకుత్‌పుర ఎమ్మెల్యే అభ్యర్థి సుందర్‌రెడ్డి
నవతెలంగాణ - చంపాపేట
అన్ని వర్గాలను ఆదరించి మంచి మార్గాన్ని చూపే మనస్తత్వం కలిగిన నాయకుడు కేటీఆర్ అని టీఆర్ఎస్ యాకుత్‌పుర ఎమ్మెల్యే అభ్యర్థి సామ సుందర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ యాకుత్‌పుర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు టీఆర్ఎస్ తరపున సామ సుందర్‌రెడ్డికి అర్హత కలింపంచిన శుభ సందర్భంగా గురువారం సుందర్‌రెడ్డి ఆయన సతీమణి స్వప్న కేటీఆర్‌ను కలిసి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. సుందర్‌రెడ్డి మాట్లాడుతూబ టీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం పనిచేసే అన్ని వర్గాల ప్రజలను పార్టీ అధిష్టానం ఆదరించి మంచి మార్గం చూపుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అర్హత కలిగిన నాయకుడినని పార్టీ గుర్తించి, తనకు యాఖత్‌పుర నుంచి పోటిచేసే అవకాశం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.