Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చిన వేలాది మంది మహిళలు
- ప్రత్యేక ఆకర్షణగా విదేశీ మహిళలు
- లేజర్ షో ద్వారా బతుకమ్మ విశిష్టత
- వర్షంలోనూ కల్చరల్ కార్నివాల్
నగరంలోని ట్యాంక్‌బండ్‌పై బుధవారం రాత్రి నిర్వహింఇన సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. నగరానికి చెందిన మహిళలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు రంగు రంగు పూలతో తయారు చేసిన బతుకమ్మలు తీసుకొచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. అందమైన బతుకమ్మలన్నీ ఒక దగ్గర పెట్టి పాడి పాడారు. 21 దేశాల నుంచి వచ్చిన 75 మంది మహిళలు తీసుకొచ్చిన బతుకమ్మలు, చేసిన డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యాటక, సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలనూ ప్రజలు తిలకించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.