Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
అల్వాల్ సర్కిల్ పరిధిలో ఉన్న చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే సహించేది లేదని మండల తహసీల్దార్ సరిత హెచ్చరించారు. శుక్రవారం స్థానికుల ఫిర్యాదు మేరకు కొత్త చెరువులో ఫెన్సింగ్‌కు ఆనుకొని అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే నిర్ధాక్షిణంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. ఎఫ్టీఎల్ పరిధిలో చెరువుల హద్దుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన కూల్చివేస్తామన్నారు.
మరో అక్రమ కట్టడాన్ని కూల్చిన టౌన్‌ప్లానింగ్ అధికారి మాధవి
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే నిర్ధాక్షిణంగా కూల్చివేస్తామని అల్వాల్ సర్కిల్ పట్టణ టౌన్‌ప్లానింగ్ అధికారిణి మాధవి హెచ్చరించారు. అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి జీ+2 నిర్మాణానికి అనుమతి తీసుకొని అదనపు అంతస్తుల నిర్మాణం చేపట్టడంతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలయం ఇచ్చిన అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టాలని ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడితే తొలగిస్తామని హెచ్చరించారు.