Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తొలుపునూరి కృష్ణాగౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని పోచమ్మబస్తీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బర్త్‌డే కేక్ కట్ చేసి కృష్ణాగౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఉదయం సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా కృష్ణాగౌడ్ చేత బర్త్‌డే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బి.నగేష్‌గౌడ్, అరవింద్‌రెడ్డి, పాట్కూరి శ్రీనివాస్, జి.యాదగిరి, కిరణ్‌గౌడ్, మేడి ప్రసాద్, జి.గోపాల్, సి.శ్రీకాంత్ పాల్గొన్నారు.