Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెక్కాడితే గాని డొక్కాడని మోచీ వృత్తిదారుల జీవితాలు
- కుటుంబ పోషణ భారం
- ప్రభుత్వాలు.. మమ్మల్ని ఆదుకోండని మోరపెట్టుకుంటున్న మోచీలు
నవతెలంగాణ - హైదరాబాద్ డెస్క్
నగరంలో రోడ్ల పక్కల కూర్చొని చెప్పులు కుడుతూ చాలా మంది మోచి వృత్తిదారులు దుర్భర జీవనం గడుపుతున్నారు. నేడు చెప్పులు తెగితే కొత్త చెప్పులు కొనుగోలు చేస్తున్నారే తప్ప కుట్టించుకునే వారు చాలా తక్కువ.. దానికి తోడు ఆన్లైన్ షాపింగ్‌తో బయటకు వెళ్లకుండా ఇంటికే వస్తున్నాయి. దీంతో మోచీల బతుకులు ఆగమ్యగోచరంగా మారాయి. ఇదే పనిని నమ్ముకుని ఏండ్ల తరబడి పని చేసే వారికి నేడు పూట గడవడం కష్టం.. కుటుంబ పోషణ భారంగా తయారైంది. వారి శ్రమ.. కష్టం.. మన ఈ వారం 'శ్రమజీవి' శీర్షికలో తెలుసుకుందాం..
చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్న మోచి వృత్తిదారుల బతుకులు ఆగమ్యగోచరంగా తయారవుతున్నాయి. ఉదయాన్నే లేచి వారు ఇంటి పనులు ముగించుకొని నగరంలోని అడ్డాల వద్దకు చేరుకుంటారు. చెప్పులను కుడుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణకుతూ.. పనులు చేస్తున్నప్పటికీ రోజుకు రూ.100 నుంచి రూ.200లు మాత్రమే సంపదిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించలేక పిల్లలను చదివించలేక రోజురోజుకూ దుర్బార జీవనం గడుపుతున్నామని వాపోతు న్నారు. ఒక్కో రోజూ అసలు గిరాకే రాదు.. ఆ రోజు పూట గడవడం చాలా కష్టంగా మారు తుంది. పిల్లలకు అన్నం పెట్టెందుకు అప్పులు చేస్తున్నామని వృత్తిదారులు వారి బాధను వ్యక్తం చేస్తు న్నారు. కొందరు వృత్తిని వదిలేసి అడ్డా కూలీలుగా మారు తున్నారు.
ఒక్కప్పుడు ఇ దే వృత్తిపై కుటుం బాల పోషణకు సరిపడే డబ్బులు వచ్చేవని, కొత డబ్బులు దాచుకునే వారిమని కొందరు చెబుతున్నారు. నేడు చెప్పుల కంపె నీలు కూడా కుప్పలుగా రావడంతో మా బతు కులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఆ కంపె నీలు తక్కువ ధరకు చెప్పు లు అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వాటికే ఆకర్షితులవు తున్నారు. దానికితోడు లెక్కలేనన్ని చెప్పుల షాపు లు, ఆన్లైన్లో అమ్మకాలు జరగడంతో చెప్పులు ఎవరూ కుట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
తాము ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబు తున్నారు. తమ బతుకులు రోజురోజుకూ ఆగమ్యగోచరంగా తయారవుతున్నాయని ప్రభు త్వాలు తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపి ఆదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు.