Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్ముకున్న కారు మబ్బులు
- పలుచోట్ల మోస్తారు వర్షం
నవతెలంగాణ - సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరమంతా చీకట్లు కమ్ముకున్నాయి. శుక్రవారం సూర్యుడు మాయమయ్యాడు. గురువారం రాత్రి హైటెక్ సిటీ, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. శుక్రవారం సైతం అదే వాతావరణం.. ట్యాంక్‌బండ్ మొత్తం పొగమంచుతో అలుముకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, రాజేంద్రనగర్, పాతబస్తీ, శామీర్‌పేట, హకీంపేట తదితర ప్రాంతాల్లో గురువారం తేలికపాటి జల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శుక్రవారం ఉదయం సైతం అదే వాతావరణం కనిపించింది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ మొత్తం పొగమంచుతో అలుముకుంది. ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరికొద్ది రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో గ్రేటర్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష కురిసే అవకాశమున్నదని వెల్లడించారు. రానున్న 24 గంటల్లో వాయుగుండం మరింత తీవ్రమైతుందని వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించారు.