Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
కేవలం వినోదా త్మకమైన నృత్యాలను కాక తమ ప్రదర్శనల్లో సామాజిక అంశాలను మేళవించి పెద్దలకు కనువిప్పు కలిగించే రీతిలో పలు సమస్యలపై స్లేట్ బాలబాలికలు నృత్యాలతో లలితా కళాతోరణం ప్రాంగణాన్ని హోరెత్తించారు. పబ్లిక్ గార్డెన్లోని లలిత కళాతోరణంలో స్లేట్ ది స్కూల్(అమీర్పేట) వార్షికో త్సవ వేడుకలు శనివారం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆనందో త్సాహాల నడుమ జరిగాయి. సెల్ఫోన్లు వాడకం వల్ల కలిగే అనర్థాలు, పెద్దలు పిల్లలను క్రమశిక్షణలో పెంచాలని, కఠినంగా దండించడం వల్ల జరిగే పరిణామాలను తమ నృత్యాలు, పాటలు ప్రదర్శిస్తూ పిల్లలు పెద్దల వేషధారణలో సందడి చేశారు. కరస్పాండెంట్ వాసిరెడ్డి అమర్నాథ్ మాట్లాడుతూ విద్యావిషయీకమైన అంశాలనే కాక తమ పాఠశాలల్లో పిల్లలను సామాజిక బాధ్యతతో ఉత్తమ పౌరులుగా రూపొందించేందుకు కళా ప్రక్రియల ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.