Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలిపెరగడంతో స్వెటర్లవైపు మొగ్గు
- నేపాలీల ప్రత్యేక అమ్మకపు సముదాయాలు
- జోరందుకుంటున్న విక్రయాలు
ఈ ఏడాది వర్షాలు తగ్గినా, ఈ మధ్యకాలంలో సహితం ఎండాకాలం కంటే ఎక్కువ వేడిమితో గడిచింది. చలి కాలం సమీపిస్తుండటంతో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు స్వెటర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. చలికాలం సమీస్తుందంటేనే ప్రతిఒక్కరికీ గుర్తుకు వచ్చేది స్వెటర్స్, మఫ్లర్లు. సాయంత్రం అయ్యిందంటే చలి మొదలవుతుండటంతో స్వెటర్లు తొడగాల్సిందే.. ఈ చలికాలం నేస్తాలకు గిరాకీ బాగానే ఉంది. సీబీఎస్, కోఠి ప్రాంతాల్లో విభిన్న రకాల స్వెటర్లు, మఫ్లర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో రకరకాల ప్యాన్సీ డిజైనర్లతో రంగురంగుల స్వెటర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.
స్వెటర్లకు ప్రసిద్ది నేపాలి వస్త్రాలు...
శీతకాలంలో వెచ్చదనానిచ్చే స్వెటర్లకు ప్రసిద్ధి నేపాలి వస్త్రాలు. ఈ వస్త్రాలకు పుత్లిబౌలి, సిబియస్, గౌలిగూడ, చాదర్‌ఘాట్ ప్రాంతాల రహదారుల వెంబడి నేపాలీల వస్త్రాలకు ప్రత్యేక విడిది. ఈ ప్రాంతాలు ప్రతిని త్యం కొనుగోలు దారులతో కిటకిటలాడుతు న్నాయి. గత కొన్నేళ్లుగా నేపాలీలు ఇక్కడ స్వెట ర్లు విక్రయిస్తుండడంతో ఈ ప్రాంతాలు ప్రధాన వాణిజ్య, వ్యాపారాలకు కేంద్రంగా మారింది.
విభిన్న రకాలు..
ఎముకలు కొరికే చలిని సైతం తట్టుకునేందుకు నాణ్యమైన స్వెటర్లు వివిధ ధరలతో లభ్యమవుతున్నాయి. ప్రత్యేకంగా రగ్గుల దుప్పట్లు, కాన్కీపట్టీ, మంకీ టోపీ, స్కాట్ స్వెట్టర్స్, లేడి స్వెట్టర్స్, చిన్న పిల్లల స్వెట్టర్స్, రెయిన్ సూట్లు, మరియు ఎంబ్రాయిడర్ వర్క్‌తో కూడిన ప్యాన్సీ డిజైన్లలో పలు రకాల స్వెట్టర్లు కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నాయి. నాణ్యతను బట్టి రూ.200 నుండి రూ.3000ల పై చిలుకు వరకు అందుబాటులో ఉన్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా నగర శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కోలుచేస్తుంటారు.
కొనుగోలు దారులకు అందుబాటులో...
గౌలిగూడ సీబీఎస్ నుండి చాదర్‌ఘాట్ వరకు గల ప్రధాన రహదారి ఇరువైపుల స్వెటర్ల సముదాయాలే దర్శనమిస్తాయి. దీనితో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో సీబీఎస్, చాదర్‌ఘాట్ మధ్య సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాణిజ్య సముదాయంలో టివేటిన్, రవూగీ, వేల్పేర్ అసోసియేషన్ వారికి ఇక్కడ విక్రయాలు జరిపించేందుకు మాత్రమే అవకాశం కల్పించారు. ప్రత్యేక కొనుగోలు చేసేందుకు అనువైన స్వెట్టర్లను అందుబాటులో ఉంచారు. ఈ స్వెట్టర్లు నేపాల్, మనీపూర్, లాతీయాన, తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయాలు కొనసాగిస్తామంటున్నారు వ్యాపారులు.
అందుబాటులో ఉండేలా..
నేపాలి నుండి తీసుకువస్తాం. చలికి ఉలెన్ వస్త్రాలు బాగా పనిచేస్తాయి. ఉలెన్ స్వెటర్లే అమ్ముతాం. బయటికి కంటే చాలా తక్కువ ధరలకే విక్రయిస్తాం. ఓడిస్సా నుండి ప్రతి ఏటా వచ్చి అమ్ముతుంటాను.
- రమాకాంత్ నాయక్(విక్రయదారుడు)
అమ్ముడు పోతాయి..
ఉలెన్ వస్త్రాలు చాలా బాగుంటాయి. అక్కడే నుం డి తీసుకువస్తాం. నేరుగా అమ్ముతాం. కాబట్టి తక్కువ ధరలకే అమ్ముతుంటాం. మంచిగా అమ్ముడు పోతాయి. మాకు 6నెలల వరకు జీతం తిండి అన్నీ ఇస్తారు. 11ఏండ్లుగా చేస్తున్నాను.
- రంజీత్ లిమ్న(విక్రయదారుడు)
సీజన్లో బాగుంటుంది..
సీజన్లో బాగా గిరా కీ ఉంటుంది.గత రెండు మాసాల కంటే ఈ మాసం లో కాస్త పెరిగింది. అందరికీ అందుబాటులో అన్ని రకాల వస్త్రాలు ఉంటా యి. కాబట్టి రేయిన్ కోట్లు కూడ కొంటారు.
- ప్రదీప్ ఫని