Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెన్ నాలాలో దోమలు, పందుల స్వైర విహారం
- మురుగునీటి దుర్వాసనతో కాలనీవాసుల అవస్థలు
- ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం
ఏండ్లు గడుస్తున్న బడంగ్‌పేట పరిధిలోని పలు కాలనీల్లో సమస్యలు, కాలనీవాసుల కష్టాలు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కాలనీ పక్క నుంచి ఓపెన్ నాలాలు పారుతున్నాయి. నాలాలకు ఆనుకుని ఉన్న ఇండ్లల్లో ముక్కు పగిలేలా దుర్వాసన వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. దానికి తోడు దోమలు, పందులు స్వైర విహరంతో విషజ్వారాల బారీన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ నాలాల సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
నవతెలంగాణ-బడంగ్‌పేట
బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులోని వరలక్ష్ల్మినగర్ కాలనీ 15 ఏండ్ల క్రితం ఏర్పడింది. కొద్దికాలానికే కాలనీ పక్క నుంచే ఓపెన్ నాలా ద్వారా మురుగునీరు వరదలాగ పారుతుంది. నాలా పక్కనే వ్యవసాయ పొలం ఉంది. పైకాలనీల నుంచి వచ్చే మురుగునీరు ఓపెన్ నాలా ద్వారా వరలక్ష్మీనగర్ కాలనీ ఇండ్ల పక్క నుంచే ప్రవహిస్తుంది. ఆ నాలాలో దోమలు విపరీతం పెరిగిపోయ్యాయని స్థానికులు వాపోతున్నారు. దానికి తోడు పందుల స్వైర విహరం వల్ల పిల్లలు, వృద్ధులు విష జ్వారాల బారీన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైనున్న కాలనీల మురుగునీరు కూడా ఇందులో కలవడంతో దుర్వానస వస్తుందని కాలనీవాసులు తెలుపుతు న్నారు. వర్షకాలం వచ్చిందంటే పైకాలనీల నుంచి వచ్చే వరదనీరుతో నాలా నిండిపోయి రోడ్డుపై, ఇండ్లలోకి మురుగునీరు వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలాను పైపులైన్గా మార్చేదెన్నడో.....
మున్సిపాలిటీ పరిధిలోని శివనారాయణ పురం కాలనీకి ఎదురుగా ఉన్న వరలక్ష్మీనగర్ కాలనీతో పాటు నవయుగకాలనీ, సాయిగోకు ల్, సాయికృష్ణ, సీతాహోమ్స్, సాయిబాలాజీ కాలనీల పక్కనుండే ఓపెన్ నాలా ప్రవహిస్తుంది. దీని పక్కనే వ్యవసాయ పొలం ఉంది. ఓపెన్ నాలా మురికినీరు మీర్‌పేట పెద్దచెరువులోకి వెళ్తుంది. ఎగువన ఉన్న 25 కాలనీలకు సంబంధించిన మురికినీరు కాలనీ పక్కనుండే పారుతుంది. కాలనీలో వందలాదిగా జీవిస్తున్న ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలా వల్ల భూ గర్భజలాలు కూడా కలుషితమయ్యాని, బోర్లలో వచ్చే నీరు దుర్వాసన వస్తున్నాయని తెలియాజేశారు. ఈ నాలా సమస్యను పరిష్కరించాలని గతంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి, మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవిచినా.. ఎవ్వరూ పట్టించుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు
ఓపెన్ నాలా సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు, వినతి పత్రాలు అందజేశాం. కానీ పట్టించుకున్న నాధుడే లేడు. వర్షాకాలం వచ్చిందంటే కాలనీ మొత్తం మురుగునీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.
- అధ్యక్షుడు కృష్ణారెడ్డి
ఓపెన్ నాలాతో అనారోగ్యాలు..
ఓపెన్ నాలాతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఓపెన్ నాలా నుంచి వచ్చే దుర్వాసన భరించలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాయత్రం నుంచి దోమల బేడద పెరిగిపోతుంది. దాంతో పిల్లలు, వృద్ధులు రోగాల పాలవుతున్నారు. ఇంటిని వదులుకోలేక కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులు వర్ణణతీతం.
- కార్యదర్శి నాథిరాం
త్వరలో పనులు ప్రారంభిస్తాం
బడంగ్‌పేట మున్సిపాలిటీ నుంచి ఓపెన్ నాలా పనులను చేయడానికి 14వ ఫైనాన్స్ రూ.30లక్షలు నిధులు మంజూరు చేశాం. మంజూరైన నిధులను టెక్నికల్ మంజూరు కోసం పంపించాం. అనంతరం టెండర్ వేయించి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మాణం చేస్తాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం.
- కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి