Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం ఎక్కడ చూసినా పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కేసర్ మండలంలో గురువారం ఉదయం 9గంటల వరకు ఎక్కడ చూసినా, మంచు వర్షం కమ్ముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక వాహనాలను కొందరు రోడ్డు పక్కనే పార్కింగ్ చేసుకున్నారు. మరికొందరు వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారులు ఇండికేటర్ వేసుకొని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. ఘట్కేసర్ చుట్టూ పక్కల గ్రామాల్లో మంచుకురవడంతో పిల్లలు, వృద్ధులు చలికి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది.