Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
డ్రంకెన్ డ్రైవ్‌లో ఓ వ్యక్తికి 7రోజులు జైలు శిక్షను హయత్‌నగర్ రెండో మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టు గురువారం విధించింది. వివరాల్లోకి వెళ్లితే...ఈ నెల 8న హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా హయత్‌నగర్‌కు చెందిన వెంకన్న బ్రీత్ ఎనలైజర్ పెట్టడంతో అత్యధిక మోతాదులో మద్యం సేవించినట్లు వచ్చింది. దాంతో అతన్ని స్పెషల్ కోర్టుకు తరలించారు.