Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమీర్‌పేట
హాస్టల్‌పై నుంచి పడిన వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌కు చెందిన సాయిప్రణరు సీఏ చదువుతున్నాడు. ఎస్ఆర్నగర్లోని కమిటీహాల్ సమీపంలో అనుపమ హాస్టల్లో ఉరటున్నాడు. గురువారం అనుకోకుండా 5వ ఫ్లోర్ నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రణరుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.