Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాతబస్తీలోని మదీన సమీపంలో..
- వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి
నవతెలంగాణ - ధూల్‌పేట్
చెప్పులకు ప్రసిద్ధి..
యూసుఫ్బజర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 300 నుంచి 350 వరకు చిన్న, పెద్ద హోల్‌సేల్ దుకాణాలు ఉంటాయి. 1980లో ఒకటి రెండు దుకాణాలతో ప్రారంభమైన ఈ బజార్ రాను రాను ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ ప్రతిరోజు ఉపయోగించే సాధారణ చెప్పుల నుంచి ఖరీదైన చెప్పులు, బూట్లు సరసమైన ధరలకు హోల్‌సేల్‌గా లభ్యమవుతాయి. ప్రస్తుతం ఈ మార్కెట్లో రోజుకు రూ.2 కోట్లమేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయంటే అతిశయోక్తికాదు.చత్తాబజార్ వెనుక వైపు ఉండే ఈ మార్కెట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేకమంది చెప్పుల వ్యాపారులకు ఇక్కడి నుంచే పెద్దమొత్తంలో సరుకును సరఫరా చేస్తుంటారు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి..
తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు ఇక్కడి నుంచే పాదరక్షలు సరఫరా అవుతుంటాయి. ఈ మార్కెట్ ప్రారంభమైన కొత్తలో రెండు నుంచి మూడు దుకాణాలు మాత్రమే ఉండేవి. ఇక్కడ జరుగుతున్న వ్యాపారాలు రోజురోజుకూ వృద్ధి చెందుతుండడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి చెప్పులు పెద్ద మొత్తంలో తీసుకెళ్తుంటారు. ఈ బజార్లో కేవలం హైదరాబాదీలే కాకుండా బీహర్, ఢిల్లీ, రాజస్థాన్, మహరాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన వారు కూడా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
సాధారణ చెప్పుల నుంచి...
సాధారణంగా రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్ చెప్పుల నుంచి మొదలు కొన్ని ఫ్యాన్సీ చెప్పులు కూడా ఇక్కడ హోల్ సేల్ ధరలకు లభిస్తుంటాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చెప్పుల దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమతమ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంతో వాటినితీసుకెళ్తుంటారు. అయితే దొరికే సాధార ణ చెప్పులను కొంత మంది వ్యాపారులు తమ సొంత కార్ఖానాలలోనే తయారు చేస్తుంటారు. ఫ్యాన్సీ చెప్పులను మాత్రం ఇతర రాష్ట్రాలను దిగుమతి చేసుకుంటామని ఫెరోజ్ అనే వ్యాపారి తెలిపారు. ఈ హోల్‌సేల్ దుకాణాల్లో రూ. 7 నుంచి 5వేల వరకు చెప్పులు హోల్‌సేల్ రేట్లకే వ్యాపారులకు అందిస్తుంటారని స్థానికులు తెలిపారు. అయితే ఇక్కడ ఒకటి రెండు జతలు కావాలంటే విడిగా అమ్మరు. కనీసం డజన్ చె ప్పులనైనా కొనాల్సిందేనని వ్యాపారులు చెబుతారు
ముడి సరుకు కూడా లభ్యం..
ఈ బజార్లో చెప్పులు మాత్రమే కాకుండా వాటి తయారీలో ఉపయోగించే అన్ని రకాల ముడిసరుకులు ఇక్కడ లభ్యమవుతాయి. బూట్లు పాలిష్ చేసే బ్రష్‌లు, చెప్పులు కుట్టడానికి ఉపయోగించే దారం, బటన్లు అన్నీ ఇక్కడ తక్కువ ధరలకు లభిస్తాయి. తోలు చెప్పుల తయారీలో వాడే లెదర్, ప్లాస్టిక్, రబ్బర్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. దీంతో చెప్పుల తయా రీదారులు తమకు కావాల్సిన ముడి సరుకులను హోల్‌సేల్‌లో ధరలకు తీసుకెళ్తుంటారు.