Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్
నవతెలంగాణ - ధూల్‌పేట్
ఆస్పత్రిలో రోగులకు ఉపయోగపడేవిధంగా రోటరీ సాటిలైట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారు కూలర్లను అందించడం అభినందనీయమని ఉస్మానియా అస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. మంగళవారం రెండు కూలర్లను అస్పత్రి సూపరింటెండెంట్‌కు క్లబ్ వారు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేసవిలో కూలర్స్ అందించడం రోగులకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. అస్పత్రిలో మండుటెండ వేసవి దృష్ట్యా కూలర్లను అవుట్ పెషెంట్(ఓపీ) భవనం నందు అత్యవసర అపరేషన్ విభాగంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇంకా అవసరమైన చోట, చల్లటీ తాగునీటి వినియోగానికి అందుబాటులో ఉంచుతామని హమీ ఇచ్చారు.