Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
తన కూతురిని చూసేందుకు వచ్చి మరో యువతిపై లైంగికదాడి చేశాడో ఘనుడు,పెండ్లి చేసుకుంటానంటూ గర్భవతిని చేసి పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం ఫలక్ నుమా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన ప్రాంతం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులు కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. మంగళవారం నారాయణగూడ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. నల్లగొండ జిల్లా గడియాగవారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ (40) వ త్తి రిత్యా హలీం చేస్తుంటాడు. ఇతని కుమార్తె కింగ్ కోఠి ప్రాంతంలోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా మహ్మద్ షరీఫ్ నగరానికి వచ్చి కుమార్తెను కలుస్తుండేవారు. ఈ క్రమంలో కుమార్తె స్నేహితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె గర్భవతి అయింది. ఈ విషయంలో బాధితురాలి ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకుంటానంటూ భరోసా కూడా ఇచ్చాడు. చంపేస్తామంటూ షరీఫ్ సోదరుడు మహ్మద్ చంద్ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో నారాయణగూడ పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.