Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేటర్‌వ్యాప్తంగా రవాణా శాఖకు మొత్తం 12 ఆర్టీఏ కేంద్రాలున్నాయి. ఇక్కడ నిత్యం 1000-1200 వరకు కొత్త రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. అలాగే మరో వెయ్యి వరకు డ్రైవింగ్, ఆర్సీ కార్డులు జారీ అవుతుండగా.. ప్రతి రోజూ వివిధ సేవల కోసం వందల సంఖ్యలో వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వస్తుంటారు. ఆయా కార్యాలయాల్లో దళారులు, సిబ్బంది కలిసి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి వినియోగదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఉదాహరణకు ఎల్ఎల్ఆర్, పర్మినెంట్ లైసెన్స్‌కు ఒక రేటు, కొత్త రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌కు ఒక రేటు ఫిక్స్ చేసి మరి తమ దందాను దళారులు కొనసాగిస్తున్నారు. ప్రతి పనినీ కోడ్ రూపంలో పిలుస్తుంటారు. ఆయా దరఖాస్తులపై పెన్సిల్ లేదా పెన్‌తో ఒక చిన్న గుర్తు వేస్తారు. అలా ఉన్నవాటిని అధికారులు క్షణాల్లో సంతకాలు చేసేస్తుంటారు. ఇక వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ విషయంలో చెప్పనక్కర్లేదు. ఫిట్నెస్ కోసం వచ్చే వాహనాలను ఆర్టీఏ అధికారి, ఓ కానిస్టేబుల్ సహాయంతో ఒక వాహనాన్ని భౌతికంగా తనిఖీ చేయాలి. కానీ అలా జరగడం లేదు. కేవలం కాగితాలు చూసి ఓకే చేస్తున్నారు. ఇది ఆన్లైన్ సేవల్లోనే ఇతర శాఖలకన్నా అగ్రభాగాన నిలిచిన రవాణాశాఖ పరిస్థితి.