Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం - మన ప్రాచీన వారసత్వ సంపద. వేయి సంవత్సరాలకు పైబడిన భాషా సాహిత్య చరిత్ర తెలుగు వారి సొంతం. నన్నయకు పూర్వపు శాసనాల కాలం నుంచి దక్షిణాంధ్ర వాఙ్మయాలు. సంస్థానాల సాహిత్య సేవ నుండి ఆధునిక యుగంలోని సాహిత్యం - సంస్థలు దాకా 48 అధ్యాయాలలో - పరిశోధకులతో సమగ్ర తెలుగు సాహిత్య చరిత్రను ఒక చోట చేర్చిన బృహత్ గ్రంథం ఇది.
వివిధ కళాశాలల పరీక్షలకే గాక : ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాలైన పోటీ పరీక్షలకు UPSC; Civil Service; JRE / NET / SLET ; D.L. ; J.L.; DSC / TRT / మొదలైన అన్ని రకాలైన పోటీ పరీక్షలకు ప్రామాణిక వ్యాసాలతో కూడిన మహత్తర ప్రయోజనకర గ్రంథం ఇది.
గుమ్మన్నగారి సోదర ద్వయం తెలుగు సాహిత్యానికి మహోపకారం చేశారని భావించవచ్చు. పురాణం, కావ్యం, ప్రబంధం, కథా కావ్యాల లాంటి ప్రాచీన ప్రక్రియలు; ద్విపద, శతకం, అవధానం, విమర్శ, నవల, కథ, కథానిక, ఖండకావ్యం లాంటి అంశాల్ని సులభ శైలిలో ఆంగ్ల భాషా మాధ్యమం చదివిన వారికి కూడా అర్ధం అయ్యేలా రాశారు రచయితలు.
ఆయా ప్రక్రియలను గురించి ఈ గ్రంథంలో...
శాసనలు, శివ కవియుగం, శ్రీనాథుడు, పోతన, తెలుగు రామాయణాలు, తెలుగు కథా కావ్యాలు, శతక సాహిత్యం, వాగ్గేయకారులు, యక్షగానాలు, వ్యాసాలు, నాటకరంగం, నవల - నాడు - నేడు, సాహిత్య విమర్శ, కథానిక వికాసం, అవధాన ప్రక్రియ, వచన గేయ కవిత్వాలు, దిగంబర, విప్లవ కవిత్వాలు, పత్రికా రంగం, జానపద విజ్ఞానం, తెలంగాణ, కోస్తా, సీమ, సాహిత్య - సాంస్కృతిక వికాసం, దళిత వాదాలు, శ్రీశ్రీ, కాళోజి, దాశరథి, విశ్వనాథ, జాషువా, సాహిత్యాలు, వెండితెర అనువాదాలు, స్త్రీ సాహిత్యాలు - ఇలా ఎన్నో... ఎన్నెన్నో... సాహిత్య సుమాల గంధంగా ఈ గ్రంథం విరాజిల్లనుంది. ఇంటింటా ఉండదగ్గ అపూర్వ - అమూల్య గ్రంథం 'సాహితీ సుధ'.
- తంగిరాల చక్రవర్తి
సెల్ : 93938 04472