Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధూల్‌పేట్
రోజు రోజుకు పెరిగి పోతున్న ఎండలతో నగరం అట్టుడుకి పోతుంది. భానుడి ప్రతాపానికి తాళలేక నరగంలోని ప్రజలు జంకుతున్నారు. నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్కులో ఏర్పాటు చేసిన పలు ఏర్పాట్లతో సందర్శకులు జూ పార్కులో అడుగు పెట్టగానే చల్ల ధనాన్ని ఆస్వాదిస్తున్నారు. జూ సందర్శకులతో కిట కిటలాడుతోంది. చక్కటి పచ్చిక బయలు.. వన్య ప్రాణుల ఆవాస కేంద్రం, సహాజ సిద్ధమైన వాతావరణంతో జూ పార్కు సందర్శకులను చల్లటి అనుభూతిని పంచుతుంది.
సహజ సిద్ధం...
ఓ పక్క ఎండ, మరో పక్క వేడి గాలి భరించలేక పోతున్నారు జనం. మండుటెండల్లో కాస్తంత సేద తీరాలని ఆశపడే వారికి సహజ సిద్ధమైన వాతావరణంతో విల్లసిల్లుతూ నెహ్రూ జూ లాజికల్ పార్కు స్వాగతం పలుకుతుంది. అరుదైన జల రాశులైన కొన్ని చేప జాతులతో ఆక్వేరియం ఆ కొంచెం ముందుకు పిల్లల పా ర్కు పెద్ద పెద్ద చెట్లల్లో సందర్శకులు సేద తీరేందుకు రచ్చ బండలు (అరుగులు), చిన్నారులు ఆడుకుంటూ కేరింత లతో సందడిగా కనిపిస్తుంది. బయట ఎండ ప్రతాపాన్ని చూస్తే అక్కడే ఉండి చెట్ల నీడల్లో సేద తీరాలనిపించేలా చేస్తుంది. గలపగాస్ దీవులకు చెందిన జాయింట్ టార్టాయిస్ (తాబేలు) 150 ఏండ్ల వరకు జీవించేవి జూ ప్రారంభం నుంచే తన ఉనికిని చాటుతున్నాయి.
జంతు ప్రపంచం...
నెహ్రూ జూ లాజికల్ పార్కులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని దేశ విదేశ సందర్శకులను అబ్బుర పరస్తోంది. వన్య ప్రాణుల పట్ల అవగాహన సందర్శకుల సౌకర్యాలను కల్పిస్తూ జంతువు లు సందర్శకులను కనువిందు చేస్తూ కనిపిస్తుంటాయి. పురివిప్పి నాట్యమాడే నెమళ్లు స్వేచ్చగా తిరిగే కొంగల కొలను, వానర జాతిలో అతి చిన్న కోతులు మొదలుకొని గ్రీన్ మంకీ, పటాన్ మంకీ, హిమాలయాన్, ఉల్స్ మంకీ, లంగూర్ తమదైన శైలిలో సందర్శకుల మదిని దోచుకుంటూ సింపా ంజీలు సైగలు చేస్తుంటాయి. అబ్బూర పరచే రంగురంగుల రామ చిలుకలు, పక్షి ప్రేమికులను లవ్ బ్రడ్స్, వైట్ కాకాటోస్ వివిధ వర్ణాలతో కనిపించే రంగురంగుల పక్షులు అబ్బూర పరుస్తుంటాయి.
పెద్ద పులులలో రాయల్ బెంగాల్, నార్మల్ టైగర్స్, అరుదైన తెల్ల పులులు, భారత సంతతికి చెందిన సింహాలు, ఎల్లో టైగర్స్, వేగంగా పరుగెత్తె అరుదైన చీతాలు, సందర్శకులను తమ స్థావరాలలో దర్శనమిస్తాయి. రాత్రి పూట సంచరించే అనేక రకాల వన్య ప్రాణులు, ప్రాకేటి ప్రాణులలో ఆనకొండ, శిల్వలు, సరి సర్పాలు, విష పూరితమైన కింగ్ కోబ్రా, రక్త పింజరి, నీటి పాములు తిలకించేందుకు వీలుగా కనిపిస్తాయి. అలాగే రంగులు మార్చే ఊసరవెల్లి, నక్షత్ర తాబేలు, చీకటి గృహలో దేవంగ పిల్లి, ముళ్ల పంది, జెంగిల్ క్యాట్, రాటేల్, పలు రకాల గుడ్ల గూబలు, గబ్బిలాలు దర్శనమిస్తాయి.
వన్యప్రాణుల జలకాలటలు..
ఎండ వేడిమి నుండి చల్ల దనం కోసం సేద తీరేందుకు నీటిలో ఈదుతూ తెల్ల పులులు, జూలో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కొలనులో అటు ఇటూ తిరుగుతూ అలకిడితో రెచ్చిపోయి పరుగులతో పంజా విసురుతుంది. ఎల్లో టైగర్స్, నీటి గుర్రం, జిరాఫి, ఏనుగులు, చల్లటి వాతావరణంలో చిలకల సందడితో జూలోని సందర్శకులను ఎండను మైమరిపించేలా సందడి చేస్తు చిన్నారులను పెద్దలను సైతం ఆకట్టుకుంటున్నాయి.