Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్త చేతులతో ఇంటికి పంపుతారా..
- నాన్‌టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య చందర్
నవతెలంగాణ-ఓయూ
కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచందర్ డిమాండ్‌చేశారు. మంగళవారం తమ డిమాండ్లను పరిష్కరించాలని ఓయూ కంట్రోలర్‌ను కలిసి తమ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అదే రెగ్యులర్ సర్వీసును పూర్తి చేసుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని పొంది, మరల కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు 70ఏండ్లు ఉద్యోగిగా కొనసాగుటకు ఆర్డర్ తీసుకురావటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఒక పక్క తక్కువ వేతనాలతో సతమతమవుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఒకేసారి 60 ఏండ్లకే ఇంటికి పంపే కార్యాక్రమం మీద ఓయూ అధికారులు పునరాలోచనచేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి 70 ఏండ్లు తమకు కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కుటుంబాన్ని పోషించుకునే అవకాశాన్ని కలిపించవసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు శ్రీకాంత్, రేణుక, మెజాహీద్, కల్యాణి, యారాల రాజేష్, మజర్, భిక్షపతి, యాదగిరి, కనేజ్ ఫాతిమా, జంగయ్య, శ్రీనివాస్, కష్ణ, హుస్సేన్ పాషా, మనోహర్, రాంరాజ్, రమేష్, అన్వరీ బేగంలు పాల్గొన్నారు.